అంతులేని విషాదం! ఖాట్మండు
నేపాల్ లో భూమితోపాటు ఆకాశమూ హిమాలయ రాజ్యంపై పగబట్టింది. వరుస ప్రకపంనలు.. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు నిలువెల్లా విషాదంలో మునిగిపోయిన నేపాలీయుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భూకంపం సంభవించి 48 గంటలు దాటడంతో శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు అననుకూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నాయి. శిథిలాలు తొలగుతున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం నాటికి మృతుల సంఖ్య 4వేలను దాటిపోయిందని అధికారులు ప్రకటించారు. మరో 7 వేల మంది క్షతగాత్రులుగా మిగిలారు. ఖాట్మండు లోయ, సింధుపాల్ చౌక్ భూకంప తీవ్రతకు ఆనవాళ్లు కోల్పోయాయి. ఈ రెండు చోట్ల సుమారు 2వేల మంది మృతి చెందారు. సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మారుమూల ప్రాంతాలకూ చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. భారత్‌కు చెందిన వెయ్యి మందికిపైగా ఎన్డీఆర్‌ఎఫ్ సభ్యులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. పశ్చిమ నేపాల్‌లో మారుమూలనున్న కొండ ప్రాంతాలను చేరుకోవడం సహాయ బృందాలకు దుర్భరంగా మారింది. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాతే సహాయ బృందాలు ఈ ప్రాంతాలకు చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలు ఊపందుకున్న తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








